13
2nd Match IPL 2025 SRH Vs RR (23 March 2025). హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో SRH తమదైన శైలిలో విజయం సాధించి టోర్నీ బోణీ కొట్టింది.
MATCH 2: SRH Vs RR – 44 పరుగులతో RR పై విజయం.
SRH – టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ (20 ఓవర్లు 286/6)
- 3.4 ఓవర్లలో 50 పరుగులు చేసిన సన్ రైజర్స్.
- జోఫ్రా ఆర్చర్ వేసిన తన మొదటి ఓవర్ రెండో బంతికి మిడ్ వికెట్ మీదుగా 105 మీటర్ల సిక్స్ బాదాడు ట్రావిస్ హెడ్.
- పవర్ ప్లే లో SRH – ఈ సీజన్ మొదటి మ్యాచ్ లోనే రాజస్థాన్ బౌలర్లను వదలలేదు.
- 6 ఓవర్లు – 94/1 [ట్రావిస్ హెడ్ – 46* (18), ఇషాన్ కిషన్ 20* (9)]
- 6.4 ఓవర్లో SRH 100 పరుగులు పూర్తి చేసుకుంది
- IPL మొదటి మ్యాచులో RCB పవర్ ప్లే లో 80 పరుగులు చేస్తే SRH రెండో మ్యాచులో 94 పరుగు సాధించింది.
- 7.1 ov: ట్రావిస్ హెడ్ 238 స్ట్రైక్ రేటుతో 50*(7×4 3×6) పరుగులు పూర్తి చేసుకున్నాడు.
- 9.3 Over: ట్రావిస్ హెడ్ 67(31) [4s-9 6s-3] పరుగులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగులో మిడ్ ఆఫ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
- 10 ఓవర్లు ముగిసిన తరువాత SRH స్కోరు – 135/2.
- 12.2 Ov: ఇషాన్ కిషన్ వరుసగా రెండు సిక్సర్లు బాది అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు, 51*(25) [4s-6 6s-2].
- జోఫ్రా ఆర్చర్ (13వ ఓవర్) బౌలింగులో ఇషాన్ 3 సిక్సర్లు కొట్టాడు. SRH 178/2 (13).
- 14.1 Ov- 200 పరుగులు పూర్తి చేసుకున్న SRH, 201/2.
- ఇషాన్ కిషన్ రెండు సిక్సర్లు ఒక డబల్ తీసి 100* (45) [4s-10 6s-6] పరుగులు పూర్తి చేసుకున్నాడు.19 ov:273/4.
RR – చేధనలో వెనకబడి 242/6 (20) వద్ద ఆగిన రాజస్థాన్
- రాజస్థాన్ ఒకే ఓవర్లో (2 ov) రెండు వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ 1 (5), రియాన్ పరాగ్ 4 (2). RR – 25/2.
- పవర్ ప్లే లో రాజస్థాన్ స్కోర్ – 77/3.
- 9వ ఓవర్లో 100 పరుగులు దాటిన RR స్కోర్.
- 26 బంతుల్లో 50 పరుగులు చేసిన సంజు సాంసన్.
- 10 ఓవర్ల అనంతరం RR స్కోరు – 118/3 [సంజు – 50, జురెల్ 46].
- 28 బంతుల్లో అర్ధసెంచరి పూర్తి చేసుకొని ధాటిగా ఆడిన జురెల్.
- ఎట్టకేలకు 111 (60) పరుగుల భాగస్వామ్యాన్ని 14వ ఓవర్లో తెరదించిన హర్షల్ పటేల్.
- సంజు శాంసన్ 66(37) [4s-7 6s-4] కీపర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
- 6 ఓవర్లలో 126 పరుగులు చేయాలి RR.
- జంపా బౌలింగులో జురెల్ కూడా అవుట్ అయ్యాడు. 70(35) [4s-5 6s-6]
రెండవ మ్యాచ్ విశేషాలు (సన్ రైజర్స్ Vs రాజస్థాన్ రాయల్స్)
- ఐపీల్ లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలరుగా జోఫ్రా ఆర్చర్ రికార్డు (4 ఓవర్లు 76/0).
- ఐపీల్ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్లాసెన్
- SRH జట్టుకు మొదటి సెంచరీ చేసిన స్వదేశీ ఆటగాడు ఇషాన్ కిషన్. 106 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
- T20 క్రికెట్ చరిత్రలోనే 250 పైన పరుగులు ఎక్కువ సార్లు సాధించిన జట్టు SRH (4 సార్లు), తరువాత ఇండియా జట్టు 3 సార్లు.
- SRH జట్టులో పరుగులు చేసిన ప్రతి ఆటగాడి స్ట్రైక్ రేట్ 200 పైనే.
- 286 – రెండో అత్యుత్తమ స్కోరు ఐపీల్ చరిత్రలో. 287, మొదటి అత్యుత్తమం కూడా SRH చేసిన స్కోరే.
- 242 పరుగులు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అత్యుత్తమ స్కోర్. ఇది వరకు పంజాబ్ పైన 226 పరుగులు.
- IPL 2025 మొదటి మ్యాచులో RCB పవర్ ప్లే లో 80 పరుగులు చేస్తే SRH రెండో మ్యాచులో 94 పరుగు సాధించింది.
మ్యాచ్ సమాచారం
తేదీ: 23-03-2025, ఆదివారం
వేదిక – హైదరాబాద్
కెప్టెన్లు – SRH (కమిన్స్), పరాగ్ (RR)
విజయం – సన్ రైజర్స్
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – ఇషాన్ కిషన్
మ్యాచ్ ఫోర్లు – SRH (34), RR (17)
మ్యాచ్ సిక్సులు – SRH (12), RR (18)