NBK 109 First Glimpse: వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రం NBK 109 షూటింగ్ జరుపుకుంటుంది. దీపావళి పండగకు టైటిల్ రివీల్ చేస్తాము అనుకున్నప్పటి విజువల్ కు సీజి పార్టు జోడించడం ఎక్కువగా ఉండడంతో మరికొంత సమయం పడుతుందని అందుకు బాలయ్య అభిమానులకు నిర్మాత సూర్య దేవరనాగవంశి సారీ చెప్పారు. అయితే నవంబర్ రెండో వారంలో టైటిల్ విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని విలేకరులు సమావేశంలో చెప్పారు.
Author: radiojalsa
Matka Telugu Trailer: ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందుండే వరుణ్ తేజ్, తాజాగా ‘మట్కా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా ఫలితం మొదలగు అంశాలు పట్టించుకోకుండా వైవిధ్య కథల్లో నటించి మెప్పించడం మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తన మొదటి సినిమా నుండి అలవాటుగా మార్చుకున్నాడు అని చెప్పవచ్చు. ఈరోజు విడుదలైన ‘మట్కా’ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. కూలీగా పని చేసే హీరో ప్రతీ ఒక్కరిని ఏలే స్థితికి ఎలా వచ్చాడో అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. పలాస కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మట్కా, 1958-1982 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. వరుణ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, నోరా ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు (28 అక్టోబర్ 2024) జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు (అడ్వాన్స్‌డ్), ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రవేశ పరీక్ష (మెయిన్) మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా 28 అక్టోబర్ నుండి 22 నవంబర్ 2024 (రాత్రి 9:00) గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అదే రెండో విడత కోసం 31 జనవరి 2025 నుండి 24 ఫిబ్రవరి 2025 (రాత్రి 9:00) గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Official Notification
భారత్ 18 ద్వైపాక్షిక స్వదేశీ టెస్టు సిరీసు విజయాల రికార్డును ఎట్టకేలకు కివీస్ తెరదించింది. పూణేలో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఘనవిజయం తమ సొంతం చేసుకుంది న్యూజిలాండ్. నెంబర్ వన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లేకుండానే గొప్ప ఫామ్ లో లేని టామ్ లేథమ్ సారథ్యంలో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్ లో అడుగుపెట్టి ఇంకో మ్యాచ్ ఉండగానే సీరీస్ విజయాన్ని అందుకుంది. గత 12 ఏళ్లలో ఓటమి ఎరగని భారత జట్టు సొంతగడ్డపై ఓటమి ఎరగడం అభిమానులను మరింత నిరాశకు లోనుచేసింది. స్పిన్ ఆడటంలో మన ఆటగాళ్లకు సాటి లేరు అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కివీస్ తో జరిగిన రెండో టెస్టులో బంతి కొద్దిగా స్పిన్ అయినా మన బ్యాటర్లు ఇబ్బంది పడిన విషయం స్పష్టంగా కనిపించింది. 36 ఏళ్లలో న్యూజిలాండ్ ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ విజయం కుడా మన సొంతగడ్డపై…
నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యుల సమావేశం సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్‌లో జరిగే అవకాశం ఉంది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఇక్కడే ఆమోదం తెలపడంతో సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో జరపనున్నారు. రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపైన ప్రజలకు అవగాహన నిమిత్తం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం (Constitution Day)గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే, అయితే 2015కు ముందు ఇదే రోజును నేషనల్ లా డే గా జరుపుకునే వాళ్ళము. భారత రాజ్యాంగం మాత్రం జనవరి 26, 1950 (గణతంత్ర దినోత్సవం) నుండి అమలులోకి వచ్చిందే.
మెగాస్టార్ చిరంజీవిని ఈరోజు హీరో అక్కినేని నాగార్జున కలిసారు. అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించారు. ఇదే విషయాన్ని ‘సోషల్ మీడియా’ వేదికగా నాగార్జున తెలియజేస్తూ ‘నాన్నగారి శతజయంతిని ఈ సంవత్సరం జరుపుకోవడం మరింత ప్రత్యేకమైనది, చిరంజీవి మరియు అమితాబ్ బచ్చన్ ఈ వేడుకకు రావడం ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా అవార్డు ఫంక్షన్ జరుపుకుందాం’ అని అన్నారు. అయితే ఈ సంవత్సరానికిగాను ఏయన్నార్ జాతీయ అవార్డు అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అందించనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డు ప్రధానం చేయనున్నారు. This year is extra special as we celebrate the 100th birth anniversary of my father, ANR garu! 🎉 Honoured to invite @SrBachchan ji and Megastar @KChiruTweets garu to the ANR Awards 2024 to…