IPL 4th Match 2025 DC Vs LSG (24-03-2025), ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై విజయం సాధించి ఐపీఎల్-18 సీజన్లో బోణీ కొట్టింది.
IPL 4th Match 2025 DC Vs LSG – క్లుప్తంగా విశేషాలు
- వేదిక – విశాఖపట్నం (డాక్టర్ Y.S. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఎ క్రికెట్ స్టేడియం)
- సమయం – 07:30 PM
- టాస్ – ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది
- కెప్టెన్స్ – ఢిల్లీ (అక్షర్ పటేల్), లక్నో (రిషబ్ పంత్)
- స్కోర్లు – ఢిల్లీ: 211/9, లక్నో: 209/08
- ఫలితం: ఢిల్లీ విజయం
–> మొదట బ్యాటింగ్ చేసిన LSG నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగా, చివరి ఓవర్లో ఒక వికెట్ చేతిలో ఉండగా ఢిల్లీ విజయాన్ని అందుకుంది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ – అశుతోష్ శర్మ
మ్యాచ్ ఫోర్లు – DC (19), LSG (15)
మ్యాచ్ సిక్సులు – DC (19), LSG (13)
లక్నో జట్టులో మిచ్చెల్ మార్ష్ 72 (36, 4s-6 6s-6), పూరన్ 75 (30, 4s-6 6s-7) పరుగులతో రాణించారు. ఢిల్లీ జట్టులో మిచ్చెల్ స్టార్క్ 42/3 (4), కుల్దీప్ యాదవ్ 20/2 (4) వికెట్లు తీశారు.
ఛేదనలో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, ఒక స్థితిలో 113-6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశలో వెళుతున్న జట్టును విప్రజ్ నిగమ్ 39 (15, 4s-5 6s-2) సహకారంతో జట్టును విజయ తీరాలకు అందించాడు అశుతోష్ శర్మ.
చివరి ఓవర్లో మొదటి బంతికి లక్నో కెప్టెన్ పంత్ స్టంప్ అవుట్ చేసే అవకాశాన్ని కోల్పోగా, చివరి వరకు క్రీజ్ లో నిల్చొని 3వ బంతికి సిక్సర్ బాది విజయాన్ని అందించాడు.