Home » IND Vs NZ 2nd Test Facts: 18 స్వదేశీ సిరీస్ విజయాల రికార్డుకు బ్రేక్

IND Vs NZ 2nd Test Facts: 18 స్వదేశీ సిరీస్ విజయాల రికార్డుకు బ్రేక్

by radiojalsa
IND Vs NZ 2nd Test Facts

భారత్ 18 ద్వైపాక్షిక స్వదేశీ టెస్టు సిరీసు విజయాల రికార్డును ఎట్టకేలకు కివీస్ తెరదించింది. పూణేలో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఘనవిజయం తమ సొంతం చేసుకుంది న్యూజిలాండ్. నెంబర్ వన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లేకుండానే గొప్ప ఫామ్ లో లేని టామ్ లేథమ్ సారథ్యంలో ఎలాంటి అంచనాలు లేకుండా భారత్ లో అడుగుపెట్టి ఇంకో మ్యాచ్ ఉండగానే సీరీస్ విజయాన్ని అందుకుంది.

గత 12 ఏళ్లలో ఓటమి ఎరగని భారత జట్టు సొంతగడ్డపై ఓటమి ఎరగడం అభిమానులను మరింత నిరాశకు లోనుచేసింది. స్పిన్ ఆడటంలో మన ఆటగాళ్లకు సాటి లేరు అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కివీస్ తో జరిగిన రెండో టెస్టులో బంతి కొద్దిగా స్పిన్ అయినా మన బ్యాటర్లు ఇబ్బంది పడిన విషయం స్పష్టంగా కనిపించింది.

36 ఏళ్లలో న్యూజిలాండ్ ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్ విజయం కుడా మన సొంతగడ్డపై దక్కని వారు ఏకంగా సీరీస్ విజయాన్ని అందుకోవడం ఖచ్చితంగా మిగుడుపడని విషయమే. అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో పిచ్ పేసర్లకు అనుకూలంగా చేయించిన గంభీర్ ఉద్దేశ్యం మంచిదే కావొచ్చు కానీ కివీస్ లాంటి జట్టుమీద అలా చేయడం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. ఆ మ్యాచ్ లో భారత్ తోలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు విఫలమవడం, ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ శర్మ స్థాయికి తగ్గట్టు రాణించకపోవడం భారత ఓటమికి ప్రధాన కారణాలు.

ముంబాయిలో జరిగే చివరి టెస్టులో అయినా విజయం అందుకొని త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టాలని సగటు అభిమాని కోరిక.

Leave a Comment