23 December 2024 Telugu Main News, డిసెంబర్ 23, 2024 రోజున జరిగిన ప్రముఖ వార్తల ప్రధానాంశాలు.
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి: కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ప్రఖ్యాత సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ (90) మరణించారు. శ్యామ్ బెనెగల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
నో డిటెన్షన్ విధానం రద్దు చేసిన కేంద్రం: ఇక నుండి 5 మరియు 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పని సరిగా పాస్ కావాల్సిందేనని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఈ నిబంధన అమలు చేయడం చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది కేంద్రం.
మలేషియా వెళ్ళాలంటే వీసా మినహాయింపు: భారతీయులు మలేసియా ప్రయాణించాలంటే వీసా అవసరం లేదు. మరో రెండేళ్ళు మలేసియా సందర్శనకు వెళ్ళే భారతీయులకు అక్కడి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే 30 రోజులు వీసా లేకుండా మలేసియాలో 31 డిసెంబర్ 2026 వరకు ప్రయాణించే అవకాశం ఉంది.
అల్లు అర్జున్‌కు నోటీసులు: సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చింది. అయితే మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీసుల విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఇదే విషయమై అల్లు అర్జున్ తన లాయర్లతో చర్చించారు తన నివాసంలో
హైకోర్టులో మోహన్ బాబుకు షాక్: విలేకరుల మీద దాడి చేసిన ఘటనలో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది.
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ అనుమానాస్పద స్థితిలో కారులో శవమై కనిపించాడని అక్కడే అపార్టుమెంటులో ఉంటున్న హనుమకొండ యువకులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.