12-12-2024 Main News Telugu: ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వివిధ రంగాల్లో…..
జమిలి ఎన్నికలు: ఒక దేశం ఒక ఎన్నికల బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. పార్లమెంట్ నుండి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించడమే అజెండాగా మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదిక ఆధారమే ఈ బిల్లు. ఇందుకు సంబంధించి జమిలి ఎన్నికల ముసాయిదాను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చు.
గుకేశ్ ప్రపంచ చెస్ విజేత: 18 సంవత్సరాల వయస్సులోనే అతి పిన్న వయస్కుడిగా 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ విజేతగా తెలుగు కుటుంబానికి చెందిన తమిళ వాస్తవ్యుడు గుకేశ్.
వైభవంగా కీర్తి సురేష్ వివాహం: చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంథోనీని నటి కీర్తి సురేష్ ఈరోజు వివాహమాడారు. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, కొద్ది మంది సన్నిహితుల మధ్య గోవాలోని ప్రముఖ రిసార్టులో వీరు వివాహం జరిగింది.
మీడియాపై దాడి- మోహన్ బాబు స్పందన: నేను మీడియాపై దాడి చేయాలని దైవసాక్షిగా అనుకోలేదని, తన ఇంట్లోకి దూసుకొచ్చిన అందరు జర్నలిస్టులా కాదా అనే విషయం తెలియలేదు, అందరు ఉద్యోగస్తులే, నేను ముందుగా అందరికీ నమస్కారం చేశా. జరిగిన ఘటన నన్ను బాధించింది. మా ఇంటి సమస్యలను మేమే కూర్చొని పరిష్కారం వెతుక్కుంటాము, మధ్యవర్తులు అవసరం లేదని 11 నిమిషాల ఆడియో విడుదల చేశారు మోహన్ బాబు.
అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం-క్లారిటీ: అల్లు అర్జున్ రాజకీయాల్లోకి త్వరలో వస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, అసత్య ప్రచారాలు నమ్మవద్దు. నిరాధమైన వాటిని, మేము ధ్రువీకరించని సమాచారాన్ని మీడియా సంస్థలు, ప్రజలు వ్యాప్తి చేయకండని కోరుతున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది.
అవంతి శ్రీనివాస్ రాజీనామా: మాజీ మంత్రి వైకాపా నేత అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించి ఇదే విషయాన్ని తెలియజేస్తూ, జగన్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని సూచించారు.