Home » FIDE World Chess Championship 2024 – ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత గుకేశ్

FIDE World Chess Championship 2024 – ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత గుకేశ్

by radiojalsa
FIDE World Chess Championship 2024

దొమ్మరాజు గుకేశ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు ఈరోజు. తన 18వ ఏట 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి సంచలనం సృష్టించాడు. అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ ఛాంపియన్ అవతారమెత్తి చరిత్ర సృష్టించాడు. ఫైనల్ లో 7.5-6.5 స్కోరుతో గుకేశ్ మాజీ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు.

తన వయసు 11 సం||లు ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ‘అతి చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ కైవసం చేసుకోవడం’ తన కల అని చెప్పి మరీ సాధించాడు ఈ ఘనత ఈరోజు. గ్యారీ కాస్పరోవ్‌ పేరు మీద ఉన్న( అతి పిన్న వయస్కుడిగా) ఈ రికార్డును గుకేశ్ అధిగమించాడు.

దొమ్మరాజు గుకేశ్ నివాసం తమిళనాడు అయినప్పటి అతను తెలుగు వాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ లతో పాటు పలువురు ప్రముఖులు గుకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
భారత యువ గ్రాండ్ మాస్టర్ మరిన్ని విజయాలు అందుకోవాలని దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశంశలతో ముంచెత్తుతున్నారు.

Leave a Comment