Home » IPOs List 11-12-24, విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్‌సైన్సెస్

IPOs List 11-12-24, విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్‌సైన్సెస్

by radiojalsa
IPOs List 11-12-24

డిసెంబర్ 11 బుధవారం నాడు విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్ సిస్టమ్స్, సాయి లైఫ్‌సైన్సెస్ ఐపీఓ లు బిడ్డింగ్ కోసం ఓపెన్ అయ్యాయి. రిటైల్, హెల్త్‌కేర్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్, ఫిన్‌టెక్ మొదలగు వివిధ రంగాలకు చెందిన కంపెనీలు IPOకు వచ్చాయి.

వన్ మొబిక్విక్ సిస్టమ్స్ సైజు

Mobikwik యొక్క మాతృ సంస్థ అయిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ డిసెంబర్ 11 మరియు డిసెంబర్ 13 మధ్య IPOని ప్రారంభింది. ఐటీ అయితే IPOకు వచ్చిన మొదటి రోజే మొదటి గంటలోనే అనూహ్యంగా 7.31 రెట్ల ఓవర్ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. 2021లోనే రూ.7600 వాల్యూయేషన్ తో ఐపీఓకు రావాలనే ప్రయత్నం ఫలించకపోవడంతో ఈసారి 70% వాల్యూయేషన్ తగ్గించుకొని రూ.2167కే రావడం జరిగింది. ఒక్కో షేరు ధరను రూ.265-279గా కంపెనీ నిర్ణయించింది. 53 ఈక్విటీ షేర్లు ఒక లాట్ సైజుగా నిర్ణయించారు.

విశాల్ మెగా మార్ట్

రూ. 8 వేల కోట్ల సమీకరనే లక్ష్యంగా ఐపీఓకు వచ్చిన విశాల్ మెగా మార్ట్ మొదటి రోజు (11-12-2024) 54% సబ్ స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేరు ధరను రూ.74-78గా, ఒక్కో లాట్ 190 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 13తో ఐపీఓ ముగియనుంది.

సాయి లైఫ్‌సైన్సెస్

ఇన్నోవేషన్ లో ముందుండే ప్రముఖ ఫార్మా కంపెనీ సాయి లైఫ్‌సైన్సెస్ రూ. 3,043 కోట్ల సమీకరణ కొరకు తొలి పబ్లిక్ ఆఫర్ కు వచ్చింది. తొలి రోజే (11 డిసెంబర్ 2024) 84% సబ్ స్క్రిప్షన్ అందుకుంది. ఆఫర్‌లో 3.88 కోట్ల షేర్లు ఉండగా, ఇన్వెస్టర్లు 3.27 కోట్ల షేర్లకు బిడ్ వేశారు. అయితే కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.522-549గా నిర్ణయించింది. ఒక్కో లాట్ 27 ఈక్విటీ షేర్లు.

ఇక ఈ మూడు IPO షేర్ల లిస్టింగ్ డిసెంబర్ 18న NSE మరియు BSEలలో జరిగే అవకాశం ఉంది.

Leave a Comment