22 December 24 Main Telugu News – ఈరోజు ముఖ్యమైన వార్తలు.
లోన్ యాప్‌లు, వడ్డీ వ్యాపారులకు కేంద్రం షాక్: చట్టబద్ధమైన సంస్థల ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో కానీ లేక భౌతికంగా అప్పు ఇచ్చే వారికి రూ.కోటి జరిమానా, 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష అమలు అయ్యే విధంగా కఠినమైన ముసాయిదాను కేంద్రం రూపొందించింది.
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన: నిన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్‌మీట్ ముఖ్యమంత్రిని అగౌరపరిచేలా ఉంది. అల్లు అర్జున్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా థియేటర్‌కు వెళ్ళాడు, అందుకు సంబంధించి మా దగ్గర పలు ఆధారాలు ఉన్నాయని అన్నారు. అదే విధంగా ఇదే అంశంపై పలువురు కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్‌ను తప్పు పట్టారు.
రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ అరవింద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిజామాబాద్ బీజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ కలిసారు.
బండి సంజయ్ సీఎంపై వాక్యాలు- శ్రీతేజ్ పరామర్శ: అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని, కక్ష సాధింపు మానుకొని గురుకుల విద్యార్థుల మీద తగిన శ్రద్ధ చూపాలని కోరారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అదే విధంగా సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు బండి సంజయ్.
జగపతి బాబు వీడియో విడుదల: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో కోలుకుంటున్న శ్రీతేజ్‌ను షూటింగ్ ముగించుకొని నేరుగా హాస్పిటల్ లో పరామర్శించి రేవతి కుటుంభానికి అండగా ఉంటానని ధైర్యం చెప్పా, సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరు రాలేదు అని అంటున్నారని ఇలా మీ ముందుకు వస్తున్నాను అని నటుడు జగపతి బాబు వీడియో సందేశం ద్వారా తెలిపారు.
బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్: బౌన్సర్లు జాగ్రత్తగా మెలగాలని, ఎక్కడైనా పబ్లిక్ ని తోసివేస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, సెలబ్రిటీలే బౌన్సర్ల బాధ్యత తీసుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీపీ సీవీ ఆనంద్.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి: విద్యార్థి సంఘాలు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసి పూలకుండీలు ధ్వంసం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి- ఖండించిన కిషన్ రెడ్డి: ఈరోజు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాంతిభద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభత్వం విఫలమైంది అని అన్నారు.
గేమ్ చేంజర్ నుండి ధోప్ పాట విడుదల: రామ్ చరణ్ తన తదుపరి చిత్రం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న గేమ్ చేంజర్ చిత్రం నుండి నాలుగో పాట ‘ధోప్’ను మేకర్స్ విడుదల చేశారు.
తొలి అండర్-19 మహిళా ఆసియా కప్ విజేత భారత్: కౌలాలంపూర్ వేదికగా ఈరోజు జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి తొలి టీ-20 ఆసియా కప్ ను సాధించింది.
మొదటి వన్డేలో భారత్ భారీ విజయం: వెస్టిండీస్ జట్టుపై నావి ముంబైలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది.