Chiranjeevi: చిరంజీవిని కలిసిన నాగార్జున – ANR 100

October 25, 2024 ·
ANR National Award

మెగాస్టార్ చిరంజీవిని ఈరోజు హీరో అక్కినేని నాగార్జున కలిసారు. అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించారు. ఇదే విషయాన్ని ‘సోషల్ మీడియా’ వేదికగా నాగార్జున తెలియజేస్తూ ‘నాన్నగారి శతజయంతిని ఈ సంవత్సరం జరుపుకోవడం మరింత ప్రత్యేకమైనది, చిరంజీవి మరియు అమితాబ్ బచ్చన్ ఈ వేడుకకు రావడం ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా అవార్డు  ఫంక్షన్ జరుపుకుందాం’ అని అన్నారు.

అయితే ఈ సంవత్సరానికిగాను ఏయన్నార్ జాతీయ అవార్డు అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవికి అందించనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డు ప్రధానం చేయనున్నారు.