9
Matka Telugu Trailer: ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందుండే వరుణ్ తేజ్, తాజాగా ‘మట్కా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా ఫలితం మొదలగు అంశాలు పట్టించుకోకుండా వైవిధ్య కథల్లో నటించి మెప్పించడం మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తన మొదటి సినిమా నుండి అలవాటుగా మార్చుకున్నాడు అని చెప్పవచ్చు.
ఈరోజు విడుదలైన ‘మట్కా’ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. కూలీగా పని చేసే హీరో ప్రతీ ఒక్కరిని ఏలే స్థితికి ఎలా వచ్చాడో అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
పలాస కరుణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న మట్కా, 1958-1982 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. వరుణ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, నోరా ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నది.