21
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు (28 అక్టోబర్ 2024) జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు (అడ్వాన్స్‌డ్), ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రవేశ పరీక్ష (మెయిన్) మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
విద్యార్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా 28 అక్టోబర్ నుండి 22 నవంబర్ 2024 (రాత్రి 9:00) గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అదే రెండో విడత కోసం 31 జనవరి 2025 నుండి 24 ఫిబ్రవరి 2025 (రాత్రి 9:00) గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.