3
- నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశం
- పార్లమెంటు సెంట్రల్ హాలులోనే భేటీ
- భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భం
- నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం
నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యుల సమావేశం సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాల్‌లో జరిగే అవకాశం ఉంది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఇక్కడే ఆమోదం తెలపడంతో సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో జరపనున్నారు.
రాజ్యాంగం ప్రాధాన్యం, అంబేద్కర్ ఆశయాలపైన ప్రజలకు అవగాహన నిమిత్తం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం (Constitution Day)గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే, అయితే 2015కు ముందు ఇదే రోజును నేషనల్ లా డే గా జరుపుకునే వాళ్ళము. భారత రాజ్యాంగం మాత్రం జనవరి 26, 1950 (గణతంత్ర దినోత్సవం) నుండి అమలులోకి వచ్చిందే.
- సమావేశాలు జరిగే పాత పార్లమెంటు భవనాన్నే సంవిధాన్ సదన్ అని పిలుస్తారు.
- దీనికి మొదటిగా ఉన్న పేరు కౌన్సిల్ హౌస్
- 1927లో ఈ భవన నిర్మాణం జరిగింది.